ప్రతిపక్ష నేత ఇప్పుడు ఎందుకు తిరగడం లేదు?

అమరావతిని రాజధాని చేయాలని మిమ్మల్ని ఎవరడిగారు చంద్రబాబు గారు?

sk rahman
sk rahman

విశాఖపట్నం: అమరావతికి మద్దతుగా రాష్ట్రమంతటా తిరుగుతానన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు తిరగడం లేదని వూడా ఛైర్మన్‌ రెహమన్‌ ప్రశ్నించారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో రాజధాని కావాలని ఎవరడిగారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. మరి అమరావతిని రాజధాని చేయాలని మిమ్మల్ని ఎవరడిగారు? అని రెహమన్‌ ప్రశ్నించారు. విశాఖ రాజధాని కావాలని 1953లోనే చట్టసభ తీర్మానం చేసిందని ఆయన గుర్తుచేశారు. అది ఎవరికీ తెలియదులే అని చంద్రబాబు అనుకున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు వచ్చి రాజధాని వద్దని ప్రజలతో అనిపించే దమ్ముందా? అని రెహమన్‌ చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. యూటర్న్‌ చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీపై విషపోరాటం చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా చేశారని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/