నేరస్థుల గురించి రోజా ఎందుకు మాట్లాడటం లేదు?

ayesha meera-mother & roja
ayesha meera-mother & roja

అమరావతి: విజయవాడ ఆయేషా మీరా మర్డర్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయేషా డెడ్‌ బాడీకి 12 ఏళ్ల తర్వాత ఇవాళ రిపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజాపై అయేషా తల్లి శంషాద్‌ బేగం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురిని చంపిందెవరో ఎమెల్యే రోజాకు తెలుసని ఆమె అన్నారు. తన కూతురు అయేషా హత్యకు గురైనపుడు రోజా ఎంతో హడావుడి చేశారని…నేరస్తులెవరో ఆమెకు తెలుసని అన్నారు. వారి గురించి అసెంబ్లీలో రోజా ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. నాయకులకు, డబ్బున్న వారికే చట్టాలు చుట్టాలని శంషాద్‌ బేగం ఆరోపించారు. మధ్యతరగతి, పేదలకు ఎప్పుడూ న్యాయం జరగదని చెప్పారు. న్యాయం కోసం 12 ఏళ్ల నుంచి పోరాడుతున్నామని మన దేశంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిందని చెప్పారు. కాగా ఏపీ దిశ యాక్ట్‌ ప్రకారం 21 రోజుల్లో నిందితులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌ ఈ కేసును కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/