మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పడంలేదు.. పుతిన్.. ఎందుకో తెలుసా?
తమ సంప్రదాయం ప్రకారం ముందస్తు విషెస్ చెప్పకూడదన్న పుతిన్

సమరఖండ్ః ఉజ్బెకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. అయితే శనివారం ప్రధాని మోడీ 72వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనున్న విషయం పుతిన్‌కు తెలిసినా.. రష్యా అధ్యక్షుడు మాత్రం మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు. ఎందుకు తాను విషెస్ చెప్పడంలేదన్న విషయాన్ని కూడా పుతిన్ వెల్లడించారు.
రేపు బర్త్‌డే జరుపుకోనున్న ప్రియతమ మిత్రుడు మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పలేకపోతున్నానని, కానీ ఇండియాకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని, మోడీరేపు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనున్నా, రష్యా సంప్రదాయం ప్రకారం ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పకూడదు. అందుకనే నేనిప్పుడు ఆయనకు విషెస్ చెప్పడం లేదు’’ అని అన్నారు. అందుకే ఒక రోజు ముందు మోడీకి బర్త్ డే విషెస్ చెప్పడం లేదని పుతిన్ అన్నారు. కానీ మిత్ర దేశం ఇండియాకు బెస్ట్ విషెస్ చెబుతున్నామని, మీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పుతిన్ తెలిపారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/