టీమిండియాను ఓడించిన వారే కప్పు గెలుస్తారు

ముందుగానే ఊహించిన మైఖేల్‌ వాన్‌

Michael Vaughan
Michael Vaughan ,Former England captain

బర్మింగ్‌హామ్‌: టీమిండియాని ఓడించిన వారే విశ్వవిజేతగా నిలుస్తారని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ చెప్పింది అక్షరాలా నిజమైంది. భారత్‌ను లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌ ఓడించగా, తొలి సెమీస్‌లో కోహ్లిసేనను న్యూజిలాండ్‌ ఓడించింది. ఈ రెండు జట్లూ ఇప్పుడు ఫైనల్‌కి చేరాయి. గురువారం ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు న్యూజిలాండ్‌ భారత్‌పై 18 పరుగులతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య 2019 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.
నిన్నటి మ్యాచ్‌ అనంతరం వాన్‌ ట్వీట్‌ చేస్తూ టీమిండియాను ఓడించినవారే ప్రపంచకప్‌ గెలుస్తారని ఎప్పుడో చెప్పానని పోస్టు చేశారు.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/