మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన బహుమతి .. గల్లా ఆగ్రహం
మహిళలకు రక్షణ ఎవరు కల్పిస్తారు?.. గల్లా జయదేవ్
galla jayadev
విజయవాడ: మహిళాదినోత్సవం రోజున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన అమరావతి మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్న ఘటనపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా జయదేవ్ స్పందిస్తూ మహిళలను అడ్డుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు.
‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, గాయాలు, అవమానాలు, ఇవి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వైస్సార్సీపీ ప్రభుత్వం మరియు ఏపీ పోలీసులు మహిళలకు ఇచ్చిన బహుమతులు. మహిళలను గుర్తించవలసిన ఈ రోజు, వారిని అగౌరవపరచడం హేయనీయం. పోలీసుల ప్రవర్తనే ఇలా ఉంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎవరు కల్పిస్తారు?’ అని ప్రశ్నించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/