వుహాన్‌లో డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం

వుహాన్‌: చైనా వుహాన్‌లో కరోనా వైరస్‌ పుట్టిన విషయం తెలిసిందే. అయితే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన నిపుణుల బృందం.. వుహాన్ మార్కెట్‌కు ఆదివారం వెళ్లింది. డబ్ల్యూహెచ్‌ఓ టీమ్ ప‌రిశీల‌న నేప‌థ్యంలో మార్కెట్ స‌మీపంలో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మార్కెట్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన త‌ర్వాత వాళ్లు మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులివ్వ‌కుండానే లోప‌లికి వెళ్లిపోయారు. గ‌తేడాది వైర‌స్‌ను గుర్తించిన త‌ర్వాత ఈ మార్కెట్‌కు మూసేశారు. అప్ప‌టి నుంచీ ప్ర‌జ‌లెవ్వ‌రికీ అందులోకి వెళ్లేందుకు అనుమ‌తివ్వ‌డం లేదు. అంతకుముందు ప్ర‌తి రోజూ కూర‌గాయ‌లు, మాంసం స్టాళ్ల ద‌గ్గ‌రికి వ‌చ్చే వేలాది మందితో ఈ మార్కెట్ క‌ల‌క‌ల‌లాడేది. అయితే డిసెంబ‌ర్ 31, 2019 రోజు రాత్రి ఈ మార్కెట్ ద్వారానే నాలుగు వింత నిమోనియా కేసులు బ‌య‌ట‌ప‌డ‌టంతో రాత్రికి రాత్రి దీనిని మూసేశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/