హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్ర‌య‌ల్స్ నిలిపివేత

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడితే ముప్పు..ఒక అధ్యయం చెప్పడంతో ఈనిర్ణయం

Tedros Adhanom
Tedros Adhanom

జెనీవా: హైడ్రాక్సీక్లోరోక్వీన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను నిలిపివేసినట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది. కరోనా  రోగుల‌కు హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇవ్వ‌డం వ‌ల్ల వారు మరణించే ముప్పు ఉంటుందని ఒక అధ్యయనం చెప్పడంతో ఈనిర్ణయం తీసుకున్నామని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాలు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను వాడ‌డం నిలిపేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. హెచ్‌సీక్యూ వినియోగంపై డేటా సేఫ్టీ మానిట‌రింగ్ బోర్డు స‌మీక్షిస్తున్న‌ద‌ని, దీనిలో భాగంగానే ఆ మాత్ర‌ల‌ను వాడ‌డం లేద‌ని టెడ్రోస్ తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌, క్లోరోక్వీన్ లాంటి మందుల‌ను కేవ‌లం మ‌లేరియా పేషెంట్లు వాడాల‌ని టెడ్రోస్ తెలిపారు. కాగా యాంటీ మ‌లేరియా ఔష‌ధం హైడ్రాక్సీక్లోరోక్వీన్‌.. కరోనా  చికిత్స కోసం కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి. వాస్త‌వానికి ఈ డ్ర‌గ్ క‌రోనా చికిత్స కోసం త‌యారు చేసింది కాదు. కానీ కరోనా  స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు మాత్రం హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/