ఒక్కరోజే లక్షా 83వేల కొత్త కేసులు నమోదు

24 గంటలో వ్యవధిలోనే 4,743 మంది మృతి..డబ్ల్యూహెచ్‌వో

corona virus-world wide

జెనీవా: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తింగా ఉద్ధృతంగా వ్యాపిస్తుంది. శనివారం ఆదివారం మధ్య 24 గంటల సమయంలో ప్రపంచం అన్ని దేశాల్లో కలిపి 1,83,000 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 4,743 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా బ్రెజిల్‌లో 54,771 ఉండగా, అమెరికాలో 36,617, భారత్‌లో 15,400 కేసులు ఉన్నాయని వెల్లడించింది.

కాగా ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 90,44,563కి చేరింది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటివరకు 4,70,665 మంది బాధితులు మరణించారు. వైరస్‌ బారినపడిన 48,37,952 మంది కోలుకోగా, మరో 37,35,946 మంది చికిత్స పొందుతున్నారు. అమెరికాలో ఆదివారం 36వేల పైచిలుకు కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 23,56,657కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 1,22,247 మంది మరణించగా, 12,54,055 మంది చికిత్స పొంతున్నారు. మరో 9,80,355 మంది బాధితులు కోలుకున్నారు. బ్రెజిల్‌లో కరోనా కేసులు ర్యాపిడ్‌ స్పీడ్‌లో రికార్డవుతున్నాయి. దీంతో దేశంలో 10,86,990 మంది కరోనా వైరస్‌ బారిన పడగా, 50,659 మంది మృతిచెందారు. మరో 4,57,105 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/