కరోనా వ్యాక్సిన్‌పై నబర్రో ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చు..అనేక వైరస్ లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదన్న ప్రత్యేక ప్రతినిధి

David Nabarro

జెనీవా: కరోనా మహమ్మారిని ఎదుక్కోనేందుకు ప్రపంచదేశాలు వ్యాక్సిన్‌ కోసం ఎదురు చేస్తున్నాయి. అయితే ఈక్రమంలో డబ్ల్యూహెచ్ఓ కొవిడ్19 ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబర్రో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకపోవచ్చని అన్నారు. చాలా రకాల వైరస్ లకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదని, కరోనా విషయంలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ ను నిలువరించే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు దాదాపు లేవని స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రయోగాల కారణంగా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నా, చప్పున చల్లారిపోతున్నాయని, అంతిమంగా అన్నీ ఈ వైరస్ ముందు దిగదుడుపేనని డాక్టర్ నబర్రో వ్యాఖ్యానించారు. కాగా ప్రయోగశాలల్లో ఇప్పటికే 100 వరకు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/