మంకీపాక్స్‌ వైరస్‌పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన చేసింది..

మంకీపాక్స్‌ వైరస్‌పై డబ్ల్యూహెచ్‌ఓ కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలకు వైరస్‌ వేగంగా వ్యాప్తి చేందుతుండటంతో మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా(ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితి) ప్రకటించింది. మంకీపాక్స్ కేసులపై డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ కమిటీ రెండోసారి సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాలు మంకీపాక్స్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

ఇప్పటివరకు ఇండియాతో కలిపి దాదాపు 75 దేశాల్లో 16,000కు పైగా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో ఇప్పటి వరకు మూడు మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. మూడు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదవ్వడం గమనార్హం. 16 దేశల్లోని మనషుల్లో మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ విస్తరించింది. జంతువుల నుంచి వ్యాప్తి చెందే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రాణాంతకం కాదు. అయినప్పటికీ వ్యాధి తీవ్రతనుబట్టి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.