వలస కూలీలను ఆదుకునేదెవరు?

లాక్ డౌన్ తో అవస్థలు

migrant workers

కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రజలంతా ఇళ్లలోనే ఉండా లని పదేపదే చెప్పే పాలకులు కూలీల గురించి పట్టించుకున్న దాఖలాలు కనపడడం లేదు.

పొట్టచేత పట్టుకొని వలస వచ్చిన కూలీలు పని స్థలాల్లో ఉండలేక ఎలాంటి ఆహారం లేక నాలుగు రోజులుగా సొంత ఊళ్లకు నడుస్తూనే ఉన్నారు.

వందల మైళ్లు నడిచే ఈ క్రమంలో పదుల సంఖ్యలో కూలీలు చనిపోతున్న వారి గురించి పట్టించుకున్న నాధుడు లేరు.

మధ్యప్రదేశ్‌కు చెందిన రణబీర్‌ సింగ్‌ ఢిల్లీ నుండి బయలుదేరి 200 కిలోమీటర్లు నడిచి ఇంకా 40 కిలోమీటర్లు వస్తే తన కుటుంబాన్ని చేరే సమయంలో ఆకలితో దారిలోనే చనిపోయాడు.

సూర్యాపేట నుండి కర్ణాటక వెళ్లే ఐదుగురు వలస కూలీలు చనిపోయారు. అందులో 18నెలల చిన్నారి మరణించడం హృదయ విదారకరం.

తమిళనాడుకు చెందిన నలుగురు వారు వెళ్లేదారిలో ఒక్క సారిగా అడవిలో మంటలు అంటుకోవడంతో ఆ నలుగురు ఆ మంటల్లో మరణించారు.

ఢిల్లీ వద్ద ఎక్స్‌ప్రెస్‌హైవేపై ఎనిమిది మంది కూలీలు రాత్రిపూట వాహనం ఢీకొని మరణిం చారు. ఎండలు బాగా ఉండడం వల్ల కూలీలు రాత్రి వేళల్లో ఎక్కువ దూరం నడుస్తున్నారు.

రాత్రి వేళల్లో ప్రజలెవ్వరు బయటకు రాకూడదనే నిబంధనతో పోలీసులు వీళ్లను అడ్డుకోవడం కోసం రాత్రి వేలల్లో వీధి దీపాలను బందు చేయడం వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇలా ప్రతి ప్రాంతంలో మరణాలు జరగుతున్నా కూలీలు వందల కిలోమీటర్లు నడుస్తున్న వారికి అభయమిచ్చేవాళ్లు కనపడడం లేదు.

కూలీల బతుకులు మారడం బాధాకరం. ఈ యుద్ధంలో గెలుపు మాదే అంటున్న ప్రధాని నరేంద్రమోడీ ఒకనాడు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి సన్మాసం చేశారు.

నేడు కరోన నుండి బయటపడిన వ్యక్తితో మాట్లాడిన ప్రధాని వలస కూలీల గురించి ఎందుకు పట్టించుకో వడం లేదు.

ప్రధాని నియోజకవర్గం వారణాసిలోనే ఆకలి బాధ తట్టుకోలేక చిన్నారులు మొక్కలు తింటున్న పరిస్థితిని చూస్తే మన అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో మన పాలకుల డొల్లతనం అర్థం చేసుకోవచ్చును.

ఆర్థిక రంగం కుప్ప కూలకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కోట్ల రూపాయాలు కార్పొరేట్లకు కేటాయిస్తున్న పాల కులు వలస కూలీల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో మేధావులు సామాజిక ఉద్యమకారులు ప్రశ్నించాల్సిన తరుణమిది.

కరోన కల్లోల సమయంలో పేదలకు, వలస కూలీలకు బడ్జెట్‌ ప్రకటించడంతోనే సరిపోదు.

సమాజంలో బాధితులను గుర్తించడం వారికి సహాయం అందేలా చర్యలు చేపట్టడం కూడా ప్రభుత్వాల బాధ్యత.

లాక్‌డౌన్‌ వల్ల వలస కూలీలతో పాటు ఉపాధి కోల్పో యిన మిగతా అసంఘటిత కార్మికుల బాగు గురించి కూడా పాలకులు ఆలోచన చేయాలి.

మద్యం ఆదాయమే ప్రధాన ఆధారంగా చేసుకొని పాలిస్తున్న మన పాలకులు లాక్‌డౌన్‌వల్ల ఆగమవ్ఞతున్న మద్యం బాధితులపై కూడా దృష్టి సారించాలి.

లేదంటే కరోనా మరణాలతో పాటు మద్యం మరణాలు కూడా పోటీ పడుతాయి.

భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు వస్తే ఆ వర్గాలు ఎలా నిలదొక్కుకోవాలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలి.

ప్రభుత్వల దగ్గర ఇటువంటి సందర్భంలో నష్టపోయే సమూహాల లెక్కల సమాచారం ఉన్నప్పటికీ అలసత్వం వహిస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవ్ఞతుంది.

పాలకులకు రాజాధికారం మీద ఉన్న శ్రద్ధ రాజ్యంలోని ప్రజల మీద లేకపోవడం వల్లనే దేశంలో ప్రజలు దుర్భర స్థితికి నెట్టివేయబడ్డారు.

పాలకులు ఇప్పటికైనా రాజ్య కాంక్షను వదలి ప్రజల దుర్భర పరిస్థితులు మెరుగుపడడంకోసం దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజల బాగుకోసం శాశ్వత ప్రణాళికలు, ప్రజా ఆరోగ్యం మెరుగుకోసం త్వరితగతిన పనులు పెట్టాలి.

ఆరోగ్య రక్షణ, రోగ చికిత్స వసతులు విసరించాలి. కరోన లాంటి వైరస్‌లను ఎదుర్కొవడానికి పరిశోధనలు చేయాలి.

వాక్సిన్లు, కొత్త మందులు తయారు చేయడమనేది నెలలో జరిగే వ్యవహారం కాదు. వీటిపై నిత్య పరిశోధనలు జరుగుతూ ఉండాలి.

అందుకోసం ప్రజా ఆరోగ్యం పై భారీగా బడ్జెట్‌ కేటాయింపులు జరపాలి. ఇ

లాంటి కల్లోల పరిస్థితిలో నిర్ణయాత్మకంగా ఎదుర్కొంటూనే మానవతా దృక్పథంతో ప్రజల సమస్యను పరిష్కరించే ఉదాత్త స్వభావమున్న దృఢ నాయకత్వం అవసరం.

ప్రజలు, సమూహాలుగా ఎదుర్కొనే సమస్యలను ఒక అవగాహనతో అర్థం చేసుకుని పరిష్కరించే నాయకత్వం కావాలి.

అందుకోసం రాజ్యం-పౌరుల మధ్య భాగస్వామ్యం నెలకొల్పాల్సిన అవసరం ఉంది.

అలా జరిగినప్పుడే ప్రజలు అభివృద్ధి చెంది ఎన్ని విపత్తులు ఎదురైన తట్టుకోగలరు.

లేదంటే దేశం ఆకలి చావుల్లోకి జారిపోయి దోపిడీలు, దొంగతనాలు, భయంతో ఆత్మహత్యలు జరిగి కోట్లలో మరణాలు పెరిగే ప్రమాదం ఉంది.

  • సాయి నరేందర్‌

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/