వంట చేసేప్పుడు

COOKING
COOKING

వంట చేసేటప్పుడు గృహిణులు తప్పని సరిగా గుర్తు పెట్టుకోవాల్సిందేమంటే, యాసిడ్స్‌ కలిగిన పదార్థాలు, అంటే టమాటాలు, అలాగే పుల్లని పదార్థాలు కోసం ఈ అల్యుమినియం పాత్రలను వాడినపుడు వీటునుంచి ఎక్కువ శాతం అల్యూమినియం పదార్థాలలో కలిసే ప్రమాదం ఉంటుంది.

ముగ్గురు పరిశోధకుల పరిశీలనలో తేలిన ప్రకారం వారు మనకు చెప్పేదేమంటే, ఒకవేళ మనం ఇంట్లో అల్యూమినియం వస్తువులను వాడాల్సి వచ్చినపుడు కూడా వాటిలో ఎక్కువ సమయం పులుపు, యాసిడ్‌ కలిగిన పదార్థాలు నిల్వ ఉంచకుండాను, ఎక్కువ సమయం వేడిచేయకుండాను వాడుకోవాలి.

కూరలు క్రోమియమ్‌, లెడ్‌, కాడ్‌మియమ్‌, నికిల్‌ వంటి మిగిలిన వస్తువులలో కంటె అల్యూమినియంలో ఉడికించేటప్పుడు మూడింతలు ఎక్కువ కరిగి పదార్థాలతో కలిసే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు.

అల్యూమినియంచేసే హాని నుంచి బయటపడాలంటే ఎనొడైజ్డ్‌ అల్యూమినియం పాత్రలను వాడుకోవాలి. ఈ ఎనొడైజ్డ్‌ మెటల్‌తో తయారు చేసిన పాత్రలు, పాన్‌లు కూడా త్వరగా వేడెక్కడమే కాక, మన్నిక కూడా ఎక్కువకాలం ఉంటుంది.

దానితో పాటు గీతలు పడకుండా,శుభ్రం చేసుకునేందుకు కూడా సులువుగా ఉంటాయి.
ఈ ఎనొడైజ్డ్‌ అల్యూమినియం పాత్రలలో పదార్థాలు వండటం వల్ల అల్యూమినియం పదార్థాలలో కలిసే ప్రమాదం అంతగా లేదని పరిశోధకులు చెప్తున్నారు.

అలాగే ఎక్కువ సమయం వేగాల్సిన, ఉడకాల్సిన, వండాల్సిన పదార్థాలను సామాన్యంగా ఇనుప మూకుళ్ళలోను, పెనాల మీద చేస్తుంటారు.

వంటింట్లో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఇవి త్వరగా మాడకుండా, ధృడంగా, అన్ని వైపులా సమానం గా వేడిని ప్రసరింపచేస్తుంటాయి. కానీ ఈ పాత్రలలో వండిన పదార్థాలలోకి కూడా పాత్రలలోని ఇనుము విడుదల అవుతుంది.

ఇలా ఎక్కువ శాతంలో ఇనుము కలిసిన పదార్థాలు కూడా విషంగా మారే ప్రమాదం ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/