విరాట్‌ కోహ్లీ ఎక్కడ?

బిసిసిఐని ప్రశ్నించిన నెటిజన్లు

Team India
Team India

ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) పోస్టు చేసిన ఓ ఫోటోపై నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. వివరాల్లోకి వెళితే… ముంబైలో బిసిసిఐ వార్షిక అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ వార్షిక అవార్డుల కార్యక్రమానికి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కోహ్లీతో సహా భారత క్రికెటర్లు హాజరయ్యారు. అయితే, ఈ ఫంక్షన్ తర్వాత భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది ఓ గ్రూప్ ఫోటోని దిగారు. ఈ ఫోటోని బిసిసిఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ నవ్వులతో టీమిండియా అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఫోటోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడం గమనించిన నెటిజన్లు మీమ్స్, కామెంట్లతో తెగ ట్రోల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ టీమిండియాలో భాగం కాదా? లేక కెప్టెన్‌గా ఆయనకు ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉన్నాయా? అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా… విరాట్ కోహ్లీ ఎక్కడంటూ మరొక నెటిజన్ ప్రశ్నించాడు. మరోక నెటిజన్ విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నానో ఆలోచిస్తున్న వారందరికీ, అతను చిత్రాన్ని క్లిక్ చేస్తున్నాడు …. భారీ త్యాగం …. నా ఫేవరేట్ కెప్టెన్ అంటూ మద్దతుగా నిలిచాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/