గురుద్వారాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా

ఆ సమయంలో నవజోత్‌ సింగ్‌  సిద్ధూ ఎక్కడ పారిపోయారో ఎవరైనా కనిపెట్టండి

Meenakshi Lekhi
Meenakshi Lekhi

న్యూఢిల్లీ: సిక్కులకు ఎంతో పవిత్రంగా భావించే నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారపై పాకిస్థాన్‌లో జరిగిన దాడులను తాను ఎంతో తీవ్రంగా ఖండిస్తున్నాని బిజెపి నాయకురాలు మీనాక్షీ లెఖీ తెలిపారు. దాడి జరిగిన సమయంలో కాంగ్రెస్‌ నాయకుడు నవజోత్‌ సింగ్‌ సిద్దూ ఎక్కడికి పారిపోయారో అంటూ ఆమె ఎద్దేవా చేశారు. అతను ఎక్కడున్నాడనేది ఎవరైనా కనిపెట్టాలని ఒక వేళ దాడి జరిగిన తర్వాత ఐఎస్‌ఐ చీఫ్‌ ను కౌగిలించుకున్నాడెమో అన్న విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా పాకిస్థాన్‌లో మతపరమైన ప్రదేశాలలో నిరంతరం హింస చోటు చేసుకుంటుందని ఆమె వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా పాకిస్థాన్‌లో బలవంత మత మార్పిడులు జరుగుతున్నాయన్నారు. అత్యాచారాలతో మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన చెందారు. పాకిస్థాన్‌లో నిరంతరం హింస కొనసాగుతుండడంతో మైనారిటీలు భారతదేశంలోకి బలవంతంగా చొరబడుతున్నారు. దీనివల్ల దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడం సరైందని తాను భావిస్తున్నట్లు సీఏఏ అవసరం భారత దేశంలో ఎంత ఉందనేది పాకిస్థాన్‌లో జరిగిన చర్యలే చెబుతున్నాయని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/