మానవాభివృద్ధిలో ఎటు వెళుతున్నాం?

గత ఏడాది ర్యాంకు 129ని కోల్పోయి 131 (0.645)వ స్థానం

human development rank down

ఇటీవల ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలైన యుఎన్‌డిపి (ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం) వారు ప్రకటించిన మానవాభివృద్ధి నివేదికలో (హెచ్‌డిఆర్‌- 2020) భారతదేశం తన గత సంవత్సరం ర్యాంకు 129ని కోల్పోయి రెండు స్థానాలు దిగజారి 131 (0.645)వ స్థానానికి చేరుకుంది.

మానవాభివృద్ధి సూచి ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిచే గుర్తింపు పొందిన దేశాలను పరిశీలించి ఈ నివేదికను రూపొందిస్తుంది.ఈ నివేదికను రూపొందించడానికి ప్రాతిపదికగా ఆయుర్దాయం. అక్షరాస్యత, తలసరి ఆదాయాలను లెక్కిస్తారు. వివిధ రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధినిపరిశీలించడమే మానవాభివృద్ధి సూచి ముఖ్యఉద్దేశ్యం.

మానవాభివృద్ధి సూచి 2020 నివేదిక ప్రకారం మానవాభివృద్ధి సూచిలో మొదటి స్థానంలో నార్వే దేశం, రెండవ స్థానంలో స్విట్జర్లాండ్‌, మూడవ స్థానంలో ఐర్లాండ్‌ దేశం,అలాగే చివరిస్థానంలో నైగర్‌ దేశం నిలి చింది.ప్రపంచ దేశాలన్నీ ప్రజలకు వైద్య,విద్య ఆదాయ వనరుల కల్పనలో ఏయే విధానాలు అనుసరిస్తున్నాయి. అవి ఎంతమేర కు ఫలితాలు సాధిస్తున్నాయి అనే విషయాలను మానవాభివృద్ధి సూచి బహిర్గతపరుస్తుంది.

అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని దేశాల నడుమ వ్యత్యాసాలను ఈ నివేదిక ద్వారా తెలుసుకునే వీలుంది. ప్రపంచస్థాయిలో దేశాల ఆర్థికస్థితిగతులనే కాకుండా ఆయా దేశాలలోని సామాన్య ప్రజానీకానికి అందుతున్న మౌలిక సదుపాయాలు, ప్రజలు ఏవిధమైన జీవనం సాగిస్తున్నారు

అనేది ఈ నివేదిక ద్వారా తెలుసుకోవచ్చు. ఆరోగ్య వంతమైన, దీర్ఘకాలిక జీవనంలో భారతదేశం గతంలో కంటే కొంత మెరుగుపడి సగటు ఆయుర్దాయం 69.7 సంవత్సరాలకు పెరిగింది. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్‌ (72.6), నేపాల్‌ (70.8), భూటాన్‌ (71.8) మనకంటే కొంత మెరుగ్గా ఉన్నాయి.

సగటు ఆయుర్దాయం గతం కంటే కొంత మెరుగైనా దేశంలో వివిధ రకాల వ్యాధుల ప్రభావం తీవ్రంగానే ఉంది. వాయుకాలుష్యం, మధుమేహం, పౌష్టికాహారలోపం, ఉబకాయం, రక్తపోటు, కిడ్నీ సంబంధిత, తదితర వ్యాధుల కారణంగా ప్రజల ఆయుర్దాయం ఆశించిన మేర పెరగడం లేదు.

భారత్‌ లాంటి అభివృద్ధిచెందు తున్న దేశాలలో కల్తీ ఉత్పత్తులు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక జనాభా కారణంగా డిమాండ్‌ కు సరిపడా సప్లయి లేనందున ఇలా కల్తీ ఉత్పత్తులు మార్కెట్ల లోకి ప్రవేశించి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. వైద్యుల కొరత కూడా ఎక్కువే. దేశంలో పదివేల జనాభాకు కేవలం ఐదు పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనేది తాజా నివేదికల్లో వెల్లడైంది.

ప్రభుత్వం వైద్యరంగానికి కేటాయిస్తున్న నిధులు భారీగా ఉన్నా అవి సామాన్య ప్రజానీకా నికి పూర్తి స్థాయి లో అందటం లేదు అన్నది ఇక్కడ తేటతెల్ల మవ్ఞతుంది. కావ్ఞన ఈ నివే దిక వైద్యరంగం లో మున్ముందు అను సరించాల్సిన విధానాలకు తోడ్పాటునందిస్తుంది.

సామాన్య పౌరుల దీర్ఘకాలిక జీవనంపై ప్రభుత్వాలు మరింత దృష్టి కేంద్రీ కరించాలి. ఆయుష్మాన్‌భారత్‌, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నా ప్రైవేట్‌ ఆస్పత్రులకు నిధులు పంచిపెడుతున్నాయి అనే విమర్శ కూడా ఉంది. భారతదేశంలో అక్షరాస్యత ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంది.

ప్రభుత్వం అక్షరాస్యత పెరుగుదలకు ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ముందుకు సాగుతుంది. అంతేకాక పలు సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రస్తుతం జాతీయ అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉంది.

ఇది ప్రపంచ సగటు అక్షరాస్యత కంటే తక్కువ. జాతీయ విద్యావిధానం 2020 ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో పెద్దఎత్తున సంస్కరణలకు తెరలేపింది కేంద్రప్రభుత్వం. మెరు గౖన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానం రూపొందించబడింది.

ఈ విధానం విద్యావ్యవస్థలో సమకాలీన అంశాలు, నైపుణ్యం వంటి వాటిలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా రూపొందించబడింది. విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో అవి ఫలితాలు ఇవ్వడం లేదు.

మధ్యాహ్నభోజన పథకాలు, ఉపకారవేతనాలు కల్పిస్తున్నా కూడా ప్రభుత్వాలు ఆశించినమేర ఫలితాలు రాబట్టు కోలేకపోతున్నాయి.ఇప్పుడున్న 10+2+3 స్థానంలో 5+3+ 3+4విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు కేంద్రంకృషి చేస్తుంది.

నూతన విద్యావిధానం ఏయే మార్పుల ను, ఎలాంటి సత్ఫలితా లు సాధిస్తుందో వేచి చూడాలి. ఒక ప్రాంతంలో ఒక మనిషికి సగటున లభించే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు.

దీన్ని స్థూల జాతీయోత్పత్తిచే దేశ జనాభాను భాగించడం ద్వారా లెక్కిస్తారు. తలసరి ఆదాయం ద్వారా ఆ దేశ జీవన ప్రమాణాలను అంచనా వేయవచ్చు. మానవ అభివృద్ధి సూచి తన నివేది కలో భారత తలసరి ఆదాయం 6,681 డాలర్లుగా పేర్కొంది. పొరుగుదేశమైన చైనా 16,057 డాలర్ల తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది.

అలాగే పాకిస్థాన్‌ తలసరి ఆదాయం 5,005 డాలర్లుగా పేర్కొంది. ఆ దేశ జాతీయ ఆదాయం, దేశ జనాభా పై తలసరి ఆదాయం ఆధారపడి ఉంటుంది. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. కానీ ఉచిత సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నాయి ప్రస్తుత ప్రభుత్వాలు. ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారతదేశం నిలిచినప్పటికీ మానవాభి వృద్ధి సూచీలో మాత్రం 131వస్థానంలో నిలవడం గమనించదగ్గ అంశం.

భారతదేశం కంటే మానవాభివృద్ధిలో 130 దేశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్థికంగా అంతగా అభివృద్ధి చెందని దేశాలు కూడా భారత్‌ కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి.

అంటే ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల్లో సరైన మార్పు రావడం లేదు. విద్య, వైద్యం వంటి మౌలిక రంగాలకు మరింత ఎక్కువ నిధులు కేటా యించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

  • కె.శ్రావణ్‌కుమార్‌

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/