నిరంతర నిఘాకు సరికొత్త అస్త్రం

WHATSAPP
WHATSAPP

 నిరంతర నిఘాకు సరికొత్త అస్త్రం

తెలంగాణ పోలీసులకు అధునాతన ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరం
ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాలపై నిఘా
రూ.6.50 కోట్లు సర్కారు మంజూరు

హైదరాబాద్‌: తెలంగాణ పోలీసుల అమ్ముల పొదిలో మరో అధునాతన అస్త్రం చేరింది. ఇప్పటికే నేరాల నివారణకు సరికొత్త టెక్నా లజిని వాడుతూ ఫలితాలు సాధిస్తున్న పోలీసు శాఖ తాజాగా ఉగ్రవాద, తీవ్రవాద కార్యక లాపాలపై నిరంతతర నిఘాకు కొత్త తరహా ఫోన్‌ ట్యాపింగ్‌ యంత్రా న్ని సొంతం చేసుకుంది. ఇందుకుగానూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరున్నర కోట్ల రూపాయలను మంజూరు చేసింది. పోలీ సు శాఖ వద్ద ఇప్పటికే ల్యాండ్‌లైన్‌, సెల్‌ఫో న్‌లను ట్యాపింగ్‌ చేసే సామాగ్రి వున్నా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాట్సాప్‌ కాల్స్‌ను కూడా ట్యాప్‌ చేసేందుకు వీలుగా ఈ కొత్త పరికరాన్ని కొను గోలు చేసింది.

దేశంలో ఏ రాష్ట్రంలో లేన ట్లుగా ఉగ్రవాద, తీవ్రవాద, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా పోలీసు శాఖ చేబడుతున్న చ ర్యల్లో భాగంగా ఈ అధునాతన ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరం అందుబాటులోకి వచ్చిందని సమాచారం. దేశంలో నంబర్‌ వన్‌ పోలీసు విభాగంగా వున్న తెలంగాణ పోలీసుశాఖ మరో ఘనతను అందుకుంది. ఇప్పటికే అనేక అం శాలలో అగ్రగామి పోలీసు విభాగంగా వున్న తెలంగాణ పోలీసు శాఖ తీవ్రవాద, ఉగ్రవాద చర్యలను ఉక్కుపాదంతో అణచి వేసేందుకు మరో ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. దేశం లోని అ నేక రాష్ట్రాలలో సమస్యగా వున్న వామపక్ష తీవ్రవాదంతో పాటు పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల కదలికలపై నిరంతరం నిఘా వేసేందుకు అధునాతన ఫోన్‌ టా ్యపింగ్‌ యంత్రాన్ని సొంతం చేసుకుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ యంత్రం అనేది సాధారణమే అయినా తెలంగాణ పోలీసు శాఖ అందుబాటులోకి వచ్చిన ఈ పరికరం దేశంలోని ఏ పోలీసు విభాగం వద్ద లేక పోవడం విశేషం.

సాధారణంగా పోలీసు విభాగాల వద్ద ఫోన్‌ ట్యాపింగ్‌ యంత్రాలు వుండడం తెలిసిందే. తీవ్రవాద, ఉ గ్రవాదంతో పాటు సంఘ విద్రోహ శక్తులపై నిఘా వుంచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటివల్ల అసాంఘీక శక్తులపై నిరంతరం ఓ కన్నేసి వుండే ందుకు వీలుంటుంది. ముఖ్యంగా బాంబు పేలుళ్లు జరిగినప్పుడు, అల్లర్లు చెలరేగినపుడు, సంఘ విద్రోహక చర్యలు జరిగినపుడు ఫోన్‌ ట్యాపింగ్‌ యంత్రాలు ని ందితులను పట్టుకునేందుకు పోలీసు శాఖకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

దిల్‌సుక్‌నగర్‌ జంట పేలుళ్లలో ఇండియన్‌ ముజహిదీన్‌ ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఈ యంత్రాలే పోలీసులకు దోహదం చేశాయి. అప్పట్లో పేలుళ్లు జరిగిన వెంటనే హైదరాబాద్‌ నుంచి పాక్‌కు, గల్ప్‌ దేశాలకు వెళ్లిన ఫోన్‌ కాల్స్‌ ఆ ధారంగా ఇండియన్‌ ముజహిదీన్‌ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులకు ఆధారాలు లభించగా చివరకు ఇది నిజమని తేలడంతో పాటు నిందితు లు పట్టుబడేందుకు అవకాశం ఏర్పడింది. అయితే పోలీసు శాఖ వద్ద వున్న ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు ల్యాండ్‌లైన్‌, సెల్‌ఫోన్‌ల వరకే పరిమితం అవడం గమ నార్హం

కొన్నేళ్లుగా దాదాపు అన్ని వర్గాల వారు వాట్సాప్‌ కాల్స్‌ వాడడం ఎక్కువయ్యింది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజి ఆధారంగా వాట్సాప్‌ కాల్స్‌ వి నియోగాన్ని అన్ని సెల్‌ సంస్థలు పెంచాయి. ఇప్పుడున్న పరికరాలతో వాట్సాప్‌ కాల్స్‌ను ట్యాపింగ్‌ చేయడం పోలీసు శాఖకు అసాధ్యంగా మారడంతో మరో అధునాతన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు సర్కారును కోరగా ఆర్థిక శాఖ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆరున్నర కోట్ల రూపాయలను ఇందుకు మంజూరు చేసింది. ఈ నిధులతో అమెరికా సహా కొన్ని దేశాలు మాత్రమే విని యోగిస్తున్న వాట్సాప్‌ కాల్స్‌ ట్యాపింగ్‌ పరికరం తెలంగాణ పోలీసుల సొంతం అయ్యింది.

ఉగ్రవాద కార్యకాలాపాలను, సంఘ విద్రోహక శక్తుల చర్యలను మరింత సమర్థవంతంగా అణిచి వేసేందుకు వీలుంటుందని పో లీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పొరుగు రాష్ట్రాలైన ఎపి,ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రలలో నక్సలైట్ల సమస్య పెరగ డం తెలిసిందే. ఈ 3రాష్ట్రాలు తెలంగాణతో సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఇందులో ఛత్తీస్‌ఘడ్‌, ఎపిలలో నక్సలిజం సమస్య కొంత ఎక్కువగానే వుంది. నెల రోజుల క్రితం ఎపిలోని విశాఖపట్నంలో ఎం.ఎల్‌.ఎతో పాటు మాజీ ఎం.ఎల్‌.ఎను నక్సలైట్లు కాల్చి చంపడం సంచలనం రేపింది. ఈ అధునాతన పరికరంతో మా ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారు….విపక్ష నేతల ఆరోపణ ఇదిలావుండగా తెలంగాణ పోలీసు శాఖ వద్ద కొత్తగా చేరిన అధునాతన ఫోన్‌ ట్యాపింగ్‌ యంత్రం సహాయంతో తమ ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారని విపక్ష నేతలు ఉత్తం కుమార్‌్‌ రెడ్డి, కోదండరాం తదితరులు ఆరోపిస్తున్నారు.