జనవరి 1 నుంచి వాట్సప్‌ పనిచేయదు

మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న ఫోన్లలో మాత్రమే

WhatsApp
WhatsApp

న్యూఢిల్లీ: విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా..? అయితే మీకోసమే ఈ గమనిక. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. రేపటి నుంచి విండోస్‌ ఫోన్లకు గుడ్‌బై చెప్పనుంది. జనవరి 1 నుంచి మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని ఆ సంస్థ అధికారికంగా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ నుంచి కూడా యాప్‌ను తొలగించినట్లు తెలిపింది. ఇప్పటికే దీనిపై పలుమార్లు ప్రకటన చేసిన వాట్సాప్‌.. తాజాగా మొబైల్‌ యూజర్లకు మరోసారి సూచించింది. కేవలం విండోస్‌ ఫోన్లలో మాత్రమే కాదు.. కొత్త సంవత్సరంలో చాలా పాత ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదట. ఐఓఎస్‌ 8, పాత వెర్షనలతో పనిచేసే యాపిల్‌ ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్‌ పనిచేయదని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. వీటితో పాటు ఆండ్రాయిడ్‌ 2.3.7 ఓఎస్‌ వినియోగదారులకు కూడా ఫిబ్రవరి నుంచి ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంటే, ఇకపై వారికి వాట్సాప్‌లో ఎలాంటి అప్‌డేట్‌లు రావు. అంతేగాక, యాప్‌ ద్వారా ఎలాంటి మెసేజ్‌లను పంపలేరు, రిసీవ్‌ చేసుకోలేరు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/