వాట్సాప్ చెల్లింపు సేవలపై స్పష్టత
ఈ ఏడాది చివరికల్లా వాట్సాప్ చెల్లింపు సేవలు

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చెల్లింపు సేవలు తీసుకురానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది చివరికల్లా పేమెంట్ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ కంపెనీ గ్లోబల్ హెడ్ విల్ కాత్‌కార్ట్ స్పష్టతనిచ్చారు. ఒకసారి దీనికి సంబంధించి అనుమతులు వచ్చాక దేశంలోని వినియోగదారులందరికీ ఈ ఏడాది చివరికల్లా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చి డిజిటల్ ఎకానమీలో భాగస్వాములు అవుతామని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తమ మెసేజింగ్ సేవల్లానే సులభంగా డబ్బును ఇతరులకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది.. భారత్‌లో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పటికే దేశంలో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటివి ఇప్పటికే ఈ సేవలను అందిస్తున్నాయి. వాట్సాప్ వీటికి పోటీకి రానుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/