వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్!

నోటిఫికేషన్స్‌ను పర్మినెంట్‌గా మ్యూట్‌ చేసే సదుపాయం

WhatsApp- The newest feature
WhatsApp- The newest feature

వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది.

నోటిఫికేషన్స్‌ను పర్మినెంట్‌గా మ్యూట్‌ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఇప్పటి వరకు ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక ఏడాదిగా ఉన్న మ్యూట్‌ ఆప్షన్లలో ‘ఆల్వేస్‌’ను చేర్చింది.

ఒక ఏడాది స్థానంలో దీన్ని తీసుకొచ్చింది. అంటే మనమిక అవసరం లేని గ్రూపుల నోటిఫకేషన్లను శాశ్వతంగా మ్యూట్‌ చేయొచ్చు.

అన్‌మ్యూట్‌ చేసే వరకు అవి మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయవు. ‘వాట్సాప్‌ వెబ్‌’లోనూ ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. 

నిజానికి యూజర్లు ఈ ఆప్షన్‌ కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. ఈ ఫీచర్‌కు సంబంధించి వాట్సాప్‌ కొన్ని నెలల క్రితమే సమాచారమిచ్చింది. అప్పటి నుంచి వాట్సాప్‌ ప్రియులు దీని కోసం ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్నారు.

వాట్సాప్‌‌ ప్రవేశపెట్టిన నాటి నుంచే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని చాలా మంది యూజర్లు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తం చేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/