ఈ యాప్‌లను వెంటనే డిలీట్‌ చేయండి

whatsapp-facebook
whatsapp-facebook

హైదరాబాద్‌ : వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ యాప్‌లు వినియోగదారుల డేటాపై నిఘాకు ఉపయోగపడుతున్నాని టెలిగ్రామ్‌ మెసెంజర్‌ యాప్‌ వ్యవస్థాపకుడు పావెల్‌ డురోవ్‌ హెచ్చరించారు. ఆ రెండు యాప్‌లను వెంటనే డిలీట్‌ చేయాలని పిలుపునిచ్చారు. తమ ఫొటోలు, మెసేజ్‌లు ఏదో ఒకరోజు బహిరంగమైనా ఇబ్బది లేదనుకునేవారు వాటిని అలాగే ఉంచుకోవచ్చన్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అనే సంస్థ ఇటీవల భారత్‌ సహా పలు దేశాలకు చెందిన 1400 మంది హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు, న్యాయవాదుల ఫోన్లపై వాట్సాప్‌లోని లొసుగు ద్వారా నిఘా వేసిన సంగతి తెలిసిందే. దాని గురించి పావెల్‌ తన టెలిగ్రామ్‌ పోస్టులో ప్రస్తావించారు. వాట్సాప్‌ సంస్థ మీ వాట్సాప్‌ సందేశాలను భద్రంగా ఉంచడంలో విఫలం కావడమే కాదు… ట్రోజన్‌ హార్స్‌లా మీ ఫోన్‌పై నిఘాకు, మీ ఫొటోలు, ఇతర మెసేజ్‌లపై గూఢచర్యానికి ఉపయోగపడుతోంది అని అందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్‌ పేరెంట్‌ కంపెనీ అయిన ఫేస్‌బుక్‌కు ఈ తరహా నిఘాలో సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/