ట్రెయినింగ్‌ ఇవ్వనున్న వాట్సప్‌!

Whatsapp
Whatsapp


న్యూఢిల్లీ: దేశంలో ఉన్న సోషల్‌ మీడియా యూజర్లును నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉంచేందుకు ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌, నాస్కాం ఫౌండేషన్‌లు ప్రారంభించాయి. రాబోయే ఎన్నికలను సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న 1 లక్ష మంది సోషల్‌ మీడియా యూజర్లకు తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఈ సంస్థలను అందజేయనున్నాయి. అందులో భాగంగానే ఈ రెండు సంస్థ‌లు ప్ర‌స్తుతం భాగ‌స్వామ్యం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు ఈ రెండు సంస్థ‌ల ప్ర‌తినిధులు డిజిట‌ల్ లిట‌రసీ ట్రెయినింగ్ ఇవ్వ‌నున్నారు. ట్రెయినింగ్‌లో భాగంగా యూజ‌ర్ల‌కు.. త‌ప్పుడు స‌మాచారాన్ని ఎలా గుర్తించాలి, దాని ప‌ట్ల రిపోర్ట్ ఎలా చేయాలి, అలాంటి స‌మాచారం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఎలా ఉండాలి.. అనే విష‌యాల‌ను ప్రాక్టిక‌ల్‌గా నేర్పిస్తారు. అందులో భాగంగానే ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో మొద‌టి ట్రెయినింగ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ ట్రెయినింగ్‌లో పాల్గొనాల‌నుకునే వారు mykartavya.nasscomfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్ట‌ర్ కూడా చేసుకోవ‌చ్చు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/