వాట్సప్‌ గ్రూపు యూజర్స్‌ జాగ్రత్త!

WhatsApp
WhatsApp

హైదరాబాద్‌: వాట్సప్‌.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వాడుకునే మెసేజింగ్‌ యాప్‌. ఇది కేవలం చాటింగ్‌తో ఆడియో, వీడియో కాల్స్‌ ఫీచర్స్‌తో ఎంతో మందికి చేరువైంది. రోజురోజుకు దీన్ని ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతుంది. అదేస్థాయిలో దీనిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. దీన్ని తగ్గించడానికి గత సంవత్సర కాలంలో వాట్సప్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏదైనా వాట్సప్‌ గ్రూప్‌ పేరుగాని, ఐకాన్‌ గానీ చట్ట విరుద్దంగా ఉన్నట్లయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సదరు గ్రూపును, అందులోని సభ్యులను వాట్సప్‌ వినియోగించకండా నిషేదించింది. యాభై మంది సభ్యులున్న మరో వాట్సప్‌గ్రూప్‌ పేరు డిస్గస్టింగ్‌గా మార్చారు. అలా మార్చిన కొద్ది గంటల్లోనే సభ్యులందరినీ వాట్సప్‌ నిషేందించింది. తిరిగి 27 రోజుల నిషేధకాలం తర్వాత ఆ ఖాతాలను పునరుద్దరించినట్లు మరో యూజర్‌ తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/