ఆడపిల్ల అయితేనేం .. కనితీరతా

ఆడపిల్ల అయితేనేం .. కనితీరతా
What if the girl ?

కీర్తనకు పెళ్లై రెండేళ్లు అయ్యింది. అందరూ ఇంకా పిల్లలు పుట్టలేదని సూటిపోటి మాటలతో వేధిస్తుంటే ఆమె మనసు ఆవేదనకు గురయ్యింది. వైద్యులకు చూపిస్తే ఎలాంటి లోపం లేదన్నారు. తర్వాత గర్భం దాల్చింది. ఇక కీర్తన ఆనందానికి అవధుల్లేవ్ఞ. తాను తల్లి కాబోతున్నాను అనే భావనే ఆమెను ఎంతో ఆనందానికి గురిచేసింది. ఆకాశంలో రెక్కలు కట్టుకుని విహరిస్తున్నంతగా మురిసిపోయింది. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలబడలేదు. ఒక్కొక్క నెల గడిస్తున్నాయి. మూడోనెల వచ్చింది. భర్త కళ్యాణ్‌ వచ్చి, ఈరోజు స్కానింగ్‌ చేయిద్దాం. నాకు ఆడపిల్ల అంటే అస్సలు ఇష్టం లేదు. అబ్బాయి అయితేనే కను, లేకపోతే అబార్షన్‌ చేయించుకో అన్నాడు. ఆ మాటలకు కీర్తన గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. తాను తల్లిని కావాలని కలలు కన్నదే తప్ప ఆడపిల్ల అయినా మగపిల్లాడు అయినా ఏం ఇద్దరూ సమానమేకదా! ఇంకా ఈకాలంలో ఆడపిల్లలే నయం. కనీసం వారికి కన్నవారిపై మమకారం వ్ఞంటుంది. మగపిల్లాడు అయితే పెళ్లి అయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోవచ్చు, పట్టించుకోకుండా పోవచ్చు. చెప్పలేం. అయితే ఎవరైతేనేం. ఆడపిల్ల కూతురు కదా? ఆమెను కన్నంత మాత్రాన తల్లిదండ్రుల మమకారం మాయమైపోతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు కీర్తనలో మెదలుతున్నాయి.

అయినా భర్తతో ఒక్కమాటైనా చెప్పలేకపోయింది. ఆటోరాగానే మౌనంగా ఆటోలో కూర్చుంది. దేవ్ఞడా నా కడుపులో బిడ్డ ఆడపిల్ల కాకుండా మగపిల్లాడు వ్ఞండేలా చేయి, అయినా నేనెందుకు అబార్షన్‌ చేయించుకోవాలి? బిడ్డను కనే స్వేచ్ఛ తనకు లేదా? ఇలా ఆలోచిస్తున్న ఆమెకు కడుపులో ఆడబిడ్డ మాత్రం ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నది. అమ్మా! నీ కడుపులో వెచ్చగా, హాయిగా వ్ఞన్నాను. నన్ను కర్కశమనసుతో హతమార్చవద్దు. నన్ను నీతోనే పెరగనివ్ఞ్వ, తొమ్మిది నెలల తర్వాత నీ ఒడిలో వ్ఞంటాను. అమ్మానాన్నల అనురాగాల మధ్య పెరిగి పెద్దదాన్ని అయి, పెద్ద చదువ్ఞ చదివి, పెద్ద ఉద్యోగం చేసి, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటా..ఇప్పుడు మాత్రం నన్ను నీనుంచి దూరం చేయకు ప్లీజ్‌ అంటూ బ్రతిమిలాడుతున్నది. మళ్లీ కీర్తన ఆలోచనలో పడింది..’నీవ్ఞ చేసిన తప్పుకు నేనెందుకు బలపశువ్ఞనవ్వాలి ఈ ప్రశ్న ఓ లక్ష కోట్లసార్లు అనుకుని ఉంటుంది. అసలు ఆ విషయం తెలిసి ఇంకా నేను ఎందుకు బతికున్నానో నాకే తెలియదు. బతికితే భవిష్యత్తేంటి! ఇప్పటికే పరోక్షంగా వెలేసిన సమాజంలో ఒడ్డునపడ్డ చేపలా క్షణం క్షణం చస్తూ బతకాలా? కీర్తన హృదయం ఈ ఆలోచనలతోనే బరువెక్కింది. అప్పటికే ఆమె కళ్ల తడి ఆరని మేఘాలే అయ్యాయి. ఆమె తీసుకున్న నిర్ణయం అక్కడ రేపుతున్న దుమారమే దానికి కారణం.

అసలు వాళ్లకి నేను నచ్చకుంటే ఈ పెళ్లి అయ్యేది కాదు కదా? బాగా చదువ్ఞతానన్నా మంచి సంబంధం అని బలవంతంగా ఒప్పించి ఈ పెళ్లి చేశారు. తల్లిదండ్రుల బాధ్యత తీరుతుందిలే అని మనస్ఫూర్తిగా ఈ పెళ్లికి ఒప్పుకున్నాకదా. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు అమాయకంగా అతడి వెంట ఏడడుగులు నడిచాను కీర్తన మనస్సు ఆలోచనల కడలి అయింది. ఒకదాని తరువాత ఒకటిగా తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు కెరటాల్లా, మరోమాట చెప్పాలంటే సునామీ అలల్లా విరుచుకుపడుతున్నాయి. ఆ అలలహోరు మనమూ విందామా అయితే కీర్తన అంతరంగం వెంట పరుగులు తీయాల్సిందే. ఆమె మనసు చెప్పే ఆ ఆలోచనలు వినాల్సిందే. అవ్ఞను ఆరోజు నాకు ఇంకా గుర్తే. ఆరోజు నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తారు ఇంకా ఆ చెట్లు చేమలు ఎక్కి దూకకు అన్న మేనత్త మాటలకు ఎలా లోపలకు పరుగులు తీసింది. అమ్మమ్మ పెట్టిన నగలన్నీ దిగేసుకుని ఒద్దిక అంటున్న పిన్ని మాటలు ఒంటపట్టించుకుని పెళ్లి వాళ్లముందు ఎంత వినయంగా కూర్చుంది. వాళ్లకి తను నచ్చడం నాన్న ఇచ్చే కట్నకానుకలు నచ్చడం అంగరంగ వైభవంగా పెళ్లి జరగడం, మొట్టమొదటి పెళ్లి చూపులకే చక్కటి మొగుడితో జత కురిపోయిందన్న స్నేహితుల మాటలకు మనసు ఎంత సంతోషసాగరమయ్యింది.

అత్తగారింట అడుగుపెట్టినాక ఆర్నెల్లకు వాళ్ల సాధింపులు మొదలవడంతో ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చింది. ప్రతిదీ కళ్లముందే కదులుతోంది. అతడే సర్వస్వమని మనస్ఫూర్తిగా నమ్మానే! ఏడాది తిరక్కుండా బిడ్డనెత్తుకోలేదన్న అత్త, ఆడపడుచుల వేధింపులకు భర్త కూడా తోడైతే కిందపెదవి పైకి పలేదే. అన్నింటిని ఓపిగ్గా భరించానే. ఎవరికోసం పుట్టింటికి వెళితే నా పెళ్లికి చేసిన అప్పులు, నా తర్వాత పెళ్లికెదిగిన చెల్లెల్ని చూసాక చావో రేవో అత్తగారిల్లే అని వచ్చేశావే. జీవితంలో ఇక ఆశ లేదన్న చేదు నిజం ఆరోజేనాకు తెలిసింది.

నాయిష్టా అయిష్టాలతో ప్రమేయం లేకుండా శరీరాన్ని తృప్తి పరుచుకుని నిద్రకుపక్రమిస్తున్న భర్తతో చెప్పలేక చెప్పానే! కడుపులో సమస్యగా ఉందని.
డాక్టర్‌ దగ్గరకెళదామని. డాక్టర్‌ నేను తల్లిని కాబోతున్నాను అని చెప్పిన ఆ మధురమైన మాటకు నాకెంతటి ఆనందాన్నిచ్చిందో మాటలతో వర్ణించలేను. ఆధునిక కాలం అన్నింట్లో ఆడపిల్లలు రాణిస్తున్నారు. ఎంతో నైపుణ్యతను ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆఫీసు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. పురుషులతో సమానంగా వేతనాలను తెస్తున్నారు. ఇంకెందుకు ఈ వివక్ష? ఎట్టి పరిస్థితుల్లోనూ అబార్షన్‌ను నేను వ్యతిరేకిస్తాను.
వచ్చే పరిణామాలు ఎలాగున్నా పర్వలేదు..ఒకలాంటి ధైర్యం ఆమెను ఆవరించింది. ఆటోలోనే ధైర్యం చేసి కీర్తన భర్తకు చెప్పింది.
పుట్టబోయే బిడ్డ ఎవరైనా సరే నేను అబార్షన్‌ చేయించుకోను, బిడ్డను కనాలను కోరిక నాకు వ్ఞంది. తల్లిగా కావాలనే ఆశ వ్ఞంది. దాన్ని నానుంచి దూరం చేయకండి..ఇందుకు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. నేను అయితే బిడ్డను కనే తీరతాను అంటూనే.. డ్రైవర్‌ ఆటోను వెనక్కి పోనివ్ఞ్వ..స్ధిరనిర్ణయంతో మిండైన ఆత్మవిశ్వాసంతో చెప్పింది కీర్తన..

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/