తాము చేసినదాన్ని మోడి ప్రశంసించారు..ట్రంప్‌

కరోనా టెస్టింగుల విషయంలో తాను గొప్పగా వ్యవహరించానని మోడి కితాబు

trump, modi
trump, modi

వాషింగ్టన్‌: కరోనాను ఎదుర్కొనే క్రమంలో తాను చేసిన పనిని భారత ప్రధాని మోడి ప్రశంసించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ చెప్పారు. కరోనా టెస్టింగుల విషయంలో తాను గొప్పగా వ్యవహరించానని మోడి కితాబునిచ్చారని అన్నారు. ఇండియా కంటే ఎక్కువ కరోనా టెస్టులు తాము చేశామని… కొన్ని పెద్ద దేశాలన్నీ కలిసి చేసిన టెస్టుల కంటే తాము ఎక్కువగా చేశామని ట్రంప్ చెప్పారు. ఇండియా కంటే 44 మిలియన్ల టెస్టులను అధికంగా చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడి తనకు ఫోన్ చేసి ప్రశంసించారని చెప్పారు. ఇదే విషయాన్ని నిజాయతీ లేని తమ దేశ మీడియాకు చెప్పాలని మోడిని తాను కోరానని ట్రంప్ అన్నారు.

చైనా వైరస్ (కరోనా) అమెరికాలోకి ప్రవేశించే సమయంలో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉన్నట్టైతే… అదనంగా మరి కొన్ని వేల మంది అమెరికన్లు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయేవారని ట్రంప్ అన్నారు. అత్యంత బలహీనమైన ప్రభుత్వంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారని… వారి హయాంలో అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/