భారత్‌-వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ షెడ్యూలు

WEST INDIES , TEAM INDIA
WEST INDIES , TEAM INDIA

భారత్‌-వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ షెడ్యూలు

న్యూఢిల్లీ: విండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. టెస్టు సిరీస్‌ ముగియడంతో ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్‌లోనూ టీమిండియానే హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కాగా, ఐదు రోజుల జరగాల్సిన హైదరాబాద్‌ టెస్టు మూడు రోజులకే ముగియడంతో వన్డే సిరీస్‌కు ముందు కోహ్లీసేనకు ఆరు రోజుల విరామం లభించింది. అక్టోబర్‌ 21న గువహటి వేదికగా జరిగే తొలి వన్డేతో ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌ నవంబర్‌ 1వ తేదీన తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో జరిగే ఆఖరి వన్డేతో ముగుస్తుంది. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ తొలి వన్డే: అక్టోబరు 21న గువహతి బసపర క్రికెట్‌ స్టేడియం రెండో వన్డే: అక్టోబరు 24న విశాఖపట్నం ఎసిఎ, విడిసిఎ క్రికెట్‌ స్టేడియం మూడో వన్డే: అక్టోబరు 27న పూణే మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం నాలుగో వన్డే: అక్టోబరు 29న ముంబై బ్రబౌర్న్‌ స్టేడియం ఐదో వన్డే: నవంబరు ఒకటిన తిరువానంతపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం