భారత్‌కు 316 లక్ష్యాన్ని విసిరిన విండీస్‌

Team india
Team india

కటక్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరుగుత్ను భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. కాగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌, భారత్‌కు 316 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. నిర్ణయాత్మక ఈ మ్యాచ్‌లో విండీస్‌ విసిరిన లక్ష్యాన్ని ఛేదిస్తే భారత్‌కు ఇది రెండో విజయం అవుతుంది. మరి వేచి చూడాలి ఈ సిరీస్‌ ఎవరికి దక్కనుందో. అయితే ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శననే ఇచ్చారని చెప్పాలి. వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ 51 బంతుల్లో 74 పరుగులు చేయగా, నికోలస్‌ పోరన్‌ 64 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరును నమోదు చేశాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/