కరోనాతో కలిసి ఉంటున్నాం.. కాస్త జాగ్రత్త!
‘మహమ్మారి’పై అవగాహన అవసరం

కరోనా అంటే ఏమిటి? కరోనా ఎలా వృద్ధి చెందుతుంది? కరోనా వ్యాధిని ఎలా నివారించవచ్చు? అనే విషయాలు అందరూ తప్పకుండా తెలుసు కోవాలి.
వైరాలోజి శాస్త్రంలో ఉన్న ఒక పాఠ్యాంశం ప్రకారం కరోనా అనేది ప్రాణములేని ఒక ఆచేతన స్థితిలో ఉన్న ప్రోటీన్ పదార్థపు కణము.
దీనిపై క్రొవ్వు పదార్థము ఒక పొరలాయేర్పడి ఒక పౌడరులా ఉంటుంది. ఇతర వాటిలా కాకుండా ఈ కణము కొంత బరువు కలిగి ఉండటంతో గాలిలో ఎగరలేదు. భూమిపై పడిపోతుంది.
ఇదొర నిర్జీవకణం, స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా అయితే 14 రోజలు ఉండి, వీర్య కణంతో జీవ కణంగా మారి, కణ విభజన మొదలవుతుందో కరోనా కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే ఉంటుంది.
ఈ మధ్యలో మానవుని శరీరంలోని ‘చీమిడితో సంపర్క ము అవుతుందో దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. మన ముక్కులోని చీమిడిలో గల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం.
మన కంటి ‘కలక లేక ‘పుసిలికానీ, ముక్కులోని ‘చీమిడి కానీ, నోటిలోని ‘గళ్ల కానీ దానికి దొరికితే వెంటనే నిమిషాల లో కొన్ని వేల, లక్షలతో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరుతుంది.
ఊపిరితిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణ వాయువు అందక మరణిస్తాడు.
దీని విస్తరణకు పడిశాన్ని ఉధృతం చేసుకుంటుంది. రోగిష్టి తుమ్మినపుడూ, దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా, కఫము ద్వారా, ఈ రోగ కణాలు పడతాయి.
లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే, వాతావరనంలోని వేడిని స్వీకరించు సామ ర్థ్యాన్ని బట్టి అవి 4 గంటలనుండి 24 గంటల వరకూ శక్తి వంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరిగిపోయి నిర్వీర్యమై పోతుంది.
ఇప్పటి వరకూ ఈ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే. వేడి తక్కువ ప్రాంతాలు కావటంతో దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేకపోవడం ఒక కారణం.
ఈ మద్య సమయంలో వాటిని మనం స్పర్మించినచో అవి మనకు అంటుకొనగలవు.
సర్వసాధారణంగా మనం మన చేతులతోనే స్పర్శించు తాము కావున మన అరచేతులకు, వ్రేళ్లకు అటుకొనగలవు.
సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్లను, ముక్కును, నోటిని స్పర్శించడం సహజం ఈ విధంగా రోగకణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి.
ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ, చీమిడిని లేక ముక్కులోని పొక్కుల నుకానీ, మన నోటిలోని గళ్లలను కానీ చేరాయో, ఇక వాటిని నిరోధించటం అసాధ్యం.
మన శరీరాన్ని, తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగానురుగు వచ్చే సబ్బుతో, రోజుకు రెండు,మూడు పర్యాయాలు రుద్దాలి.
38 డిగ్రీలు అంతకన్నా హెచ్చువేడి నీటితో,బాగా నురుగు సబ్బుతో మనం ధరించే వస్త్రాలను, కర్చీలను మాస్కులను శుభ్ర పరచుకుంటే కణాలపై వున్న క్రొవ్వును కరిగించి నిర్వీర్యం చేయవచ్చు.
కరోనా వైరస్‌తో కలిసి బతకాల్సిన అనివార్య పరిస్థితులు ముందు కొచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తల పాటించి కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
- శ్రీనివాస్ తిపిరిశెట్టి
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/