భారత వెయిట్‌లిఫ్టర్‌ సీమాపై నాలుగేళ్ల నిషేధం

Indian Weightlifter Seema
Indian Weightlifter Seema

ఢిల్లీ: భారత వెయిట్‌లిఫ్టర్‌ సీమా నిషేదిత ఉత్ప్రేరకాలు పట్టుబడిన నేపథ్యంలో జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ(నాడా) నాలుగేళ్లు నిషేధం విధించింది. ఆమె నుంచి నాడా అధికారులు నమూనా తీసుకోగా, వాటిని పరీక్షించిన అంతర్జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ(వాడా) నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేల్చింది. దీంతో నాడాకు చెందిన యాంటీ డోపింగ్‌ డిసిప్లీనరీ ప్యానెల్‌ ఆమెపై వేటు వేసింది. సీమా నమూనా మెటాబొలైట్‌ ఆఫ్‌ టామోక్సిఫెన్‌, ఎస్‌ఈఆర్‌ఎం మెటెనోలెన్‌, ఎనొబోస్రమ్‌, ఎస్‌ఏఆర్‌ఎం, ఉన్నట్లు తేలిందని చెప్పింది. మా నిబంధనలను ఉల్లఘించిన కారణంగా ఆమెపై నిషేధం విధించినట్లు వెల్లడించింది. కాగా సీమా 2017 కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో 75 కేజీల విభాగంలో సీమా రజత పతకం గెలిచింది. 2018 గోల్డ్‌కోస్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఆమె ఆరోస్థానంలో నిలిచింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/