స్వస్థ

బరువు తగ్గాలనుకుంటున్నారా?

ఆరోగ్యం – జీవనం

శరీరంలోని ఆదనపు కొవ్వును తగ్గించుకోవటానికి ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. కాస్త కష్టపడాలి.. అపుడే మంచి ఆరోగ్యం , చక్కని శరీరాకృతి సొంతం అవుతుంది..

Want to lose weight

కెలొరీలు తగ్గింపు.:

మనం తీసుకునే ఆహారంలో అన్ని పదార్ధాల నుంచి ఒకే మొత్తం లో కెలోరీలు లభ్యం కావు… కొన్నిటి నుంచి ఎక్కువ మొత్తంలో, మరికొన్నింటి నుంచి తక్కువ మొత్తం లో లభిస్తాయి., చక్కర, కొవ్వు పదార్ధాల నుంచి చాల ఎక్కువ కెలోరీలు అందుతాయి..
కాబట్టి, రోజువారీ ఆహారంలో చక్కర వాడకాన్ని బాగా తగ్గించుకోవాలి..

మేలైన మాంసకృత్తులు :

ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులను తీసుకోవాలి.. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి… ఈ సూక్ష్మ పోషకాలు కండరాలను బలంగా మార్చడంతో పాటు కణాలను బాగుచేస్తాయి.. ఎంజైమ్స్, హార్మూనల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి.. కాబట్టి ప్రోటీన్లు వుండే, గుడ్లు, చేపలు, ఫలాలను ఆహారంలో చేర్చుకోవాలి.

తాజా పండ్లు, కూరగాయలు:

ఇవి బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.. కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటును నియంత్రిస్తాయి.. రోగ నిరోధకతాను పెంచుతాయి.. పండ్లు, కూరగాయల్లోని యాంటీ ఆక్సీడెంట్స్ కాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి… అయితే కేవలం వీటినే తింటూ బరువు తగ్గించాలని అనుకోకూడదు.. మిగతా పధార్ధాలతోనూ కలిపి తీసుకుంటే ప్రయోజనాలు అందుతాయి..

బరువులు ఎత్తటం:

ఆహారంలో మార్పులొక్కటే కాదు. వ్యాయామం సరిగా చేసినపుడే అధిక బరువును వదిలించుకోగలం ఇందుకోసం వారంలో రెండు మూడు సార్లు కాస్త కష్టమైన వ్యాయామాలను ప్రయత్నించండి.. వారంలో 3 నుంచి 5 రోజులు బరువులు ఎత్తే వర్కవుట్ లను ప్రయత్నించండి.. ఇవే కాకుండా రోజులో 10 వేళా అడుగులు నడవటం, 8 గంటలు కంటి నిద్ర ఉంటే అదనపు బరువును సులువుగానే తగ్గొచ్చు. ఇక ప్రయత్నించండి..

‘నాడి’ (ఆరోగ్య సూచనలు, సలహాలు) కోసం: https://www.vaartha.com/specials/health1/

Suresh

Recent Posts

దావోస్ పర్యటన లో రాష్ట్రానికి 4200 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన కేటీఆర్

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజవంతంగా పూర్తి అయ్యింది. ఈనెల 18 లండన్ కు చేరుకున్న కేటీఆర్,…

2 mins ago

ఎన్టీఆర్ ఘాట్ వద్ద దగ్గుబాటి పురందేశ్వరి భావోద్వేగం

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జయంతి వేడుకలు…

24 mins ago

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన జూ. ఎన్టీఆర్

నేడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా జూ. ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని…

40 mins ago

ష్యోక్ నదిలో బోల్తా పడిన ఆర్మీ వాహ‌నం.. ఏడుగురు జ‌వాన్ల మృతి ..

7 soldiers killed after army vehicle falls into Shyok river in శ్రీన‌గ‌ర్ : ల‌ద్దాఖ్‌లోని ష్యోక్…

16 hours ago

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 632…

17 hours ago

నితిన్ గడ్క‌రీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు

గ‌డ్క‌రీతో తాను క‌లిసి ఉన్న ఫొటోను యాడ్ చేసిన టీడీపీ చీఫ్‌ tdp-chief-chandrababu అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు…

17 hours ago