ఏపి పోలీసులకు వారాంతపు సెలవు

వారిపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం

AP police
AP police

అమరావతి: ఏపి పోలీసుశాఖలో సిబ్బందికి వారాంతపు సెలవులను బుధవారం నుంచి అమలు చేస్తున్నట్లు శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ డాక్టర్‌ రవిశంకర్‌ చెప్పారు. పోలీసుశాఖలో 30 విభాగాలు ఉన్నాయని, వాటిని అధ్యయనం చేసి 19 మోడళ్లను రూపొందించామని తెలిపారు. వీక్లీఆఫ్‌ నిర్వహణకు ప్రతి జిల్లాలో నోడల్‌ ఆఫీసర్‌గా ఎస్పీస్థాయి అధికారి బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. పని ఒత్తిడి కారణంగా 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల పోలీసు సిబ్బందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తమ పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. వారాంతపు సెలవు అమలుతో పోలీసులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/