వెడ్డింగ్ డాల్స్ గిఫ్ట్స్
చిన్నారుల కోసం ఆట వస్తువులు

పెళ్లి కూతురు బొమ్మను తయారు చేయాలంటే దర్జీ దగ్గరికి వెళ్లి మంచి అంచుండే గుడ్డముక్కను తెచ్చి దాన్ని కుచ్చులు వచ్చేలా కుట్టి, దానికి తగ్గ జాకెట్ బట్టను బొమ్మకు చుట్టేసేవాళ్లం.
ఆ బొమ్మకు వచ్చే జుట్టుతోనే బుజ్జి జడను అల్లి, గడ్డిపూలను తెచ్చి గుచ్చేవాళ్లం.
తెగిపోయిన పూసల దండలతో చిన్నచిన్న గొలుసుల్ని చేసి వేసి, తికంతో వచ్చీరాని కల్యాణం బొట్టు పెట్టి బుగ్గ మీద కాటుక చుక్క పెట్టేస్తే, పెళ్లి కూతురు ముస్తాబు పూర్తయ్యేది.
మిగతా అలంకారం పర్తిచేసేలోపు బొట్టూ కాటుకా చెరిపోయిన ఆ బొమ్మ ఎలా ఉన్నా మకు మాత్రం ఎంత ముద్దొస్తోందో అనిపించేది.
అబ్బాయి బొమ్మను పెళ్లి కొడుకు బొమ్మగా చేయాలన్నా కాస్త ఇటూఇటూగా ఇంతే తంతు ఉంటుంది.
ఇక, వాటిని పక్కపక్కన పెట్టి స్నేహితులంతా చేరి మాత్రల తరగపు కాగితాల్ని మంగళసూత్రాలుగా మార్చి చేసే బొమ్మల పెళ్లి ఎవరి జీవితంలోనైనా ఓ మరపురాని ఘట్టం.
ఇప్పుడు పెళ్లి కూతురూ పెళ్లి కొడుకుల బొమ్మల్ని అందంగా ముస్తాబు చేసి ఇస్తున్నాయి కొన్ని సంస్థలు.
‘వెడ్డింగ్‌డాల్స్ పేరిట దొరుకుతున్న వీటిలో రకరకాల సంప్రదాయాల ముస్తాబులను ప్రతిబింబించేలా పెళ్లి బొమ్మల్ని రూపొందిస్తున్నారు.
అమ్మాయి బొమ్మకు మంచి పట్టుచీర కట్టి, కుప్పెలు వేసిన జడకు రాళ్లబిళ్లలతో అలంకారం చేస్తున్నారు.
గాజులూ, బుట్టలూ, వడ్డాణం, ముక్కుపుడకా ఇలా లన్నీ పెటిట బాసికాన్నీ, పూలదండల్నీ కూడా జోడిస్తున్నారు.
అబ్బాయికి సంప్రదాయాన్ని బట్టి పంచె కట్టూ, కోటూ లేదా లాల్చీ పైజమాలను ధరింపచేస్తున్నారు.
ఈ బొమ్మల్ని ఇలాగే కొనుక్కోవచ్చు. లేదంటే అమ్మాయి బొమ్మకు ఫలానా రంగు చీర జాకెట్టూ వేయమన్నా, ఇలాంటి జడానగలూ కావాలన్నా,
అబ్బాయికి ధోతీ ఈ తరహాలో ఉండాలన్నా ఆ మార్పులన్నీ చేసి కూడా ఇస్తారు.
కాబట్టి మనింట్లోకి తెచ్చుకునే పెళ్లి కొడుకూ పెళ్లికూతురు బొమ్మల్ని మనకిష్టమైనట్లే తయారు చేయించుకోవచ్చన్నమాట. పిల్లలు పెళ్లి ఆట ఆడుకునేందుకే కాదు,
ప్రియమైన వారికి కానుకగా ఇచ్చేందుకూ, షోకేసులో పెట్టుకునేందుకూ, రిటర్న్ గిఫ్ట్‌లుగా అందించేందుకూ కూడా ఇవి బాగుంటాయి.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/