తెలంగాణ లో మాస్క్ తప్పనిసరి చేసిన ఆరోగ్యశాఖ

wearing-mask-is-must-in-telangana-dh-srinivas-rao

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఇక నుంచి ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తప్పక మాస్కు ధరించాలని సూచించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు 500కు చేరువలో ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో.. భాగ్యనగర పరిసర ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాజమాన్యాలు కూడా పాఠశాలల్లో కరోనా నిబంధలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. నిన్నటి కంటే తక్కువ గానే ఈరోజు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 18819 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,52,164 కు చేరింది.