10 రోజుల్లో యూరియా సమస్యను పరిష్కరిస్తాం

Gutta Sukhender Reddy
Gutha Sukhender Reddy

నల్గొండ: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్టుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఆయన అన్నారు. మరో 11 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిసే కోమటిరెడ్డి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నీచంగా, మూర్ఖంగా, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి తీరు కల్లుతాగిన కోతిలా ఉందని ఎద్దేవా చేశారు. యూరియా కొరతపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు సరికాదని గుత్తా అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే… కేంద్రం నుంచి యూరియాను తెప్పించాలని సవాల్ విసిరారు. 10 రోజుల్లో యూరియా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/