ఏపిలో ఎవ్వరితో పొత్తు అవసరం లేదు

Ram madhav
Ram madhav

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మాకు ఎవరితోను పొత్తు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ వ్యాఖ్యానించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మేము ఏ పార్టీకి జూనియర్‌గా వ్యవహరించేది లేదని రాంమాధవ్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు తన పార్టీ నుంచి వలసను ఆపే ప్రయత్నంలో బిజెపితో పొత్తు గురించి మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు విధానం ఆకులు కాలాక చేతులు పట్టుకునే రీతిలో ఉందన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని రాంమాధవ్‌ తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/