వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

మామునూర్ విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

minister errabelli dayakar rao

వరంగల్‌: పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మామునూర్ విమానాశ్రయ స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. సిఎం కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌ నాయకత్వంలో జిల్లాలో ఎయిర్ పోర్ట్ కోసం కోసం కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. మామునూర్ విమానాశ్రయ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భూ స్వభావ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విమానాశ్రయ ఏర్పాటు కోసం ఏర్పాటు కోసం 1140 ఎకరాల స్థలం కావాలని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారన్నారు. 700 ఎకరాల స్థలం ఉండగా మరో 200 ఎకరాల స్థలం రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/