విడతలవారీగా ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి

Alla Nani
Alla Nani

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులను విడతల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏపి అసెంబ్లీ సమావేశాల్లో పలువురు వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి నాయకులు ప్రభుత్వాస్పత్రుల అంశంపై ప్రస్తావించారు. కాగా ఈ నేపథ్యంలో మంత్రి నాని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తాడేపల్లి ఏరియా ఆస్పత్రిని నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. కాగా ప్రస్తుతం తాడేపల్లి ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ.11 కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెక్నీషియన్స్‌ విషయంలో కూడా కొరత ఉన్నదని ఉన్నతాధికారులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. మే నెలాఖరులోగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నాని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/