రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
చంద్రబాబు కుట్రలను అధికారంలోకి రాక ముందే ఊహించాం

అమరావతి: ఏపి మంత్రి పేర్ని నాని టిడిపి అధినేత చంద్రబాబు పై మండిపడ్డారు. ఏపిలో మూడు రాజధానుల విషయంపై హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పలు కుట్రలకు పాల్పడుతారని తాము ముందే అంచనా వేసినట్లు చెప్పారు. ‘చంద్రబాబు కుట్రలు అన్నింటినీ అధికారంలోకి రాక ముందే మేము ఊహించాం. ఆయన ఏ విధంగా వ్యవస్థలని మేనేజ్ చెయ్యగలడో అందరికీ తెలుసు. వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తాం తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే కచ్చితంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం’ అని పేర్ని నాని ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/