చంద్రబాబుపై జరిగిన దాడి గురించి కేంద్రాన్ని ఆశ్రయిస్తాము

devineni uma
devineni uma

అమరావతి: టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటనపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు రాజకీయం చేశారని దేవినేని ఉమా తీవ్రంగా విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..జడ్‌ప్లస్‌ భద్రతలో ఉన్న వ్యక్తి ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారు. ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఎలా వుంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని ఆయన మండిపడ్డారు. డీఎస్పీ సమక్షంలోనే ఈ దాడి జరిగిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని అన్నారు. రైతు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాళ్లు విసిరారని చెబుతారా? అంటూ పోలీసుల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధానిని రక్షించుకునేందుకు వచ్చే నెల టిడిపి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబుపై జరిగిన దాడి గురించి కేంద్రాన్ని ఆశ్రయిస్తామని, ప్రధాని మోడిని కలిసి వైఎస్‌ఆర్‌సిపి నాయకులు చేసే దుర్మార్గాలను వివరిస్తామని దేవినేని ఉమా తెలిపారు. ఇంకా న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/