మేం అధికారంలోకి వస్తే మహిళా బిల్లు ఆమోదిస్తాం!

Rahul Gandhi
Rahul Gandhi

చెన్నై: మహిళలు పురుషుల కంటే చురుకైన వారని రాహుల్‌ గాంధీ కొనియాడారు. చెన్నైలోని ‘స్టెల్లా మేరిస్‌’ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరై విద్యార్థినులతో చిట్‌చాట్‌ చేశారు. ఈసందర్భంగా రాహుల్‌ మాట్లాడుతు తాము అధికారంలోకి వచ్చాక మొదటి పార్లమెంట్‌ సమావేశాల్లోనే మహిళా బిల్లు ఆమోదిస్తామని ఆయన అన్నారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన హామి ఇచ్చారు. ఖఖదేశంలో మహిళలు ఎలాంటి వివక్షాపూరిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారో ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి రాష్ట్రాలకు వెళితే తెలుస్తుంది. అక్కడి పరిస్థితులను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అందుకే ఈ వివక్షతకు చికిత్స చేయాలిగగ అని అన్నారు. పురుషులతో సమాన స్థాయిలో మహిళలు ఉండాలి. పార్లమెంట్‌, రాష్ట్ర అసెంబ్లీల్లో చూశాను. మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేదు. అందుకే 2019లో మహిళా బిల్లు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. అంతే కాకుండా వారికి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం అని రాహుల్ గాంధీ అన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/