మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

జర్నలిస్టు మిత్రుల కాలు విరగొట్టిన ఘటన తీవ్రంగా బాధించింది

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై ట్విట్టర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. మమ్మల్ని అడ్డుకొనే పనిలో భాగంగా వైఎస్‌ఆర్‌సిపి రౌడీలు మీడియా ప్రతినిధులపై దాడి చేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని లోకేష్‌ అన్నారు. నా ప్రజా చైతన్యయాత్ర కవరేజ్‌కి వచ్చి వెళ్తున్న మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడి చేసి జర్నలిస్టు మిత్రుల కాలు విరగొట్టిన ఘటన తీవ్రంగా బాధించిందని నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా మరో ట్విట్‌లో నాన్న గారిని, నన్ను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి జగన్‌ పడుతున్న కష్టంలో పది శాతం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడినా రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉండేవి కావని నారా లోకేష్‌ అన్నారు. కక్ష సాధింపే లక్ష్యంగా, రౌడీయిజమే ఊపిరిగా ముందుకుకి వెళ్లాలి అనుకుంటే మీ ఇష్టం జగన్‌ కానీ మీడియా ప్రతినిధులేం చేసారు? అని లోకేష్‌ ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/