ఇకమీదట ఎటువంటి లోపాలు లేకుండా ఆయుధాలను రూపొందిస్తాం

Putin
Putin

మాస్కో : శ్వేత సముద్రం వద్ద ప్రమాదంలో ఇటీవల దెబ్బతిన్న నూక్లియర్‌ పవర్‌ రాకెట్‌ను తిరిగి అభివృద్ధి చేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో శ్వేత సముద్రం వద్ద నావికా పరీక్ష నిర్వహిస్తుండగా రాకెట్‌ ఇంజన్‌ పేలిపోయింది. ఈ సంఘటనలో అణు ఇంజనీర్లతో సహా ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారి పేరుతో అవార్డులను వారి భార్యలకు అందించేందుకు క్రెమ్లిన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుతిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఇకమీదట ఎటువంటి లోపాలు లేకుండా ఆయుధాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తామని పుతిన్‌ స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/