పైలట్ కోసం ప్రార్థిస్తున్నాం

హైదరాబాద్‌: నేడు పాక్‌ అదుపులో భారత పైలట్‌ అభినందన్ ఉన్న సంగతి తెలిసిందే.ఆయన క్షేమ సమాచారం కోసం దేశమంతా ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఆ వీర పైలట్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కష్టకాలంలో పైలట్ కోసం, అతని కుటుంబం కోసం తాము ప్రార్థిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలను పక్కన పెట్టి పైలట్ విషయంలో పాకిస్థాన్ మానవత్వంతో మెలగాలని కోరుతున్నామని ట్వీట్ చేశారు.