కమలేష్‌ తివారిని హత్య చేసింది మేమే

ఆల్‌ హింద్‌ బ్రిగేడ్‌ ప్రకటన

KAMLESH TIWARI
KAMLESH TIWARI

లక్నో: హిందూ సమాజ్‌ పార్టీ అధ్యక్షుడు కమలేష్‌ తివారిని ఇద్దరు వ్యక్తులు ఆయన పార్టీ కార్యాలయంలో హత్య చేశారు. వారిద్దరు కూడా తివారినీ కత్తితో పొడిచి, ఆ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన తివారినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే తివారీని హత్య చేసింది తామేనంటూ ఆల్‌ హింద్‌ బ్రిగేడ్‌ ప్రకటించింది. వారు చేసిన మెసేజ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నది. కమలేష్‌ తివారి ముస్లింలను చులక చేసి మాట్లాడటం, ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆయనను హత్య చేసినట్లు మెసేజ్‌లో వివరించారు. మెసేజ్‌తో పాటు తివారి ఫొటో కూడా పోస్లు చేశారు. ఇస్లాంను గాని, ముస్లింలను కానీ తక్కువ చేసి మాట్లాడితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని కూడా దాంట్లో హెచ్చరించారు. ఇలాంటివి ఇంకా చూస్తారు అని కూడా రాశారు. ఆల్‌ హింద్‌ బ్రిగేడ్‌ తామే కమలేష్‌ను హత్య చేసినట్లు ప్రకటించినప్పటికీ ఎంతవరకు నిజమో అధికారికంగా తెలియలేదు. తివారీ హిందూ మహాసభ మాజీ సభ్యుడు. సొంతంగా హిందూ సమాజ్‌ పార్టీని స్థాపించి దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా కమలేష్‌ తివారి హత్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో అన్వర్‌ ఉల్‌హక్‌ అనే ముస్లిం మతపెద్దను అరెస్టు చేశారు. అతన్ని ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/