అయ్యర్‌కు సరైన స్థానం ఇవ్వడం లేదు

Anil Kumble
Anil Kumble

ముంబయి: భారత క్రికెట్‌ జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ ఎంతో ముఖ్యమైన ఆటగాడని భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే పేర్కొన్నాడు. అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పదే పదే మార్చడాన్ని అనిల్‌ కుంబ్లే ప్రధానంగా తప్పుబట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో అయ్యర్‌ను ఐదు, ఆరు స్థానాల్లో పంపడాన్ని ప్రస్తావించాడు. ఆ స్థానాల్లో అయ్యర్‌ను పంపడం సరైనది కాదని తెలిపాడు. క్వాలిటీ ఆటగాడైన అయ్యర్‌కు నాల్గవ స్థానమే కరెక్టు అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. శిఖర్‌ ధావన్‌ జట్టులో లేని కారణంగా కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ ఓపెనింగ్‌ చాన్స్‌ చేసే అవకాశం వచ్చింది. దాంతో అయ్యర్‌ను నాల్గో స్థానంలో బ్యాటింగ్‌ పంపడానికి ఆస్కారం ఉంటుంది. మనం అయ్యర్‌ ఆటను చూస్తూనే ఉన్నాం అత్యంత నిలకడగా నాణ్యమైన క్రికెట్‌ ఆడుతున్నాడని కుంబ్లే పేర్కొన్నాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/