ఎన్నడూ ఏ దేశంపైనా మనం దండయాత్ర చేయలేదు

venkaiah-naidu

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న పరిస్థితిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేసిన అనంతరం ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు మాట్లాడారు. వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన భార‌త్ .. ఎన్న‌డూ మ‌రో దేశంపై దండ‌యాత్ర చేయ‌లేద‌ని భారతీయ ప‌రంప‌ర‌, సంస్కృతి వ‌సుదైక కుటుంబం అని, స‌ర్వే జనా సుఖినోభ‌వంతో అని మ‌న ఇతిహాసాలు పేర్కొంటాయ‌న్నారు. మ‌న అంద‌రం క‌లిసి క‌ట్టుగా సైన్యం వెంట ఉన్నామ‌ని చైర్మ‌న్ వెంక‌య్య తెలిపారు.

ఈ నేప‌థ్యంలో రక్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌కు సూచ‌న చేశారు. ఎవరైనా స‌భ్యులు కానీ, అధికారులు కానీ ఈ అంశం గురించి చ‌ర్చించాల‌నుకుంటే.. వారితో వీలైతే ఏకాంతంగా కూడా మాట్లాడాల‌న్నారు. దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త అంశంలో అంద‌రూ ఆస‌క్తిగా ఉంటార‌న్నారు. వాస్త‌వంగా ఎల్ఏసీ వ‌ద్ద ఉన్న ప‌రిస్థితి ఏంటో తెలియాల‌ని విప‌క్షాల‌కు ఉంటుంద‌ని, వారికి పూర్తి స‌మాచారాన్ని ఇవ్వాల‌ని వెంక‌య్య సూచించారు. విప‌క్ష స‌భ్యుల‌ను విశ్వాసంలోకి తీసుకుని వారికి ప్ర‌భుత్వ విధానం తెలియ‌చేయాల‌న్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/