కోహ్లీపై శ్రీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు అతను ఎక్కడ ఉన్నాడో చూడండి

Krishnamachari Srikkanth & Virat Kohli
Krishnamachari Srikkanth & Virat Kohli

ఢిల్లీ: భారత సారథి విరాట్‌ కోహ్లీ గురించి టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇప్పుడు కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు. ఇది మాకు ఎంతో సంతృప్తినిచ్చింది అని శ్రీకాంత్‌ అన్నారు. ఓ మీడియా సమావేశంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ‘2008లో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు స్వీకరించా. 2011 ప్రపంచకప్‌ను గెలవగలిగే జట్టును సిద్ధం చేయాలన్నదే అప్పటి నా కల. దేవుడి దయ వల్ల మాకు ధోనీ లాంటి మంచి కెప్టెన్‌ ఉన్నాడు. ప్రపంచకప్‌ విజయం నా క్రికెట్‌ ప్రయాణంలో అత్యుత్తమ క్షణం’ అని పేర్కొన్నాడు. ‘ఇప్పుడు మీకో విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. విరాట్‌ కోహ్లీ ఈ రోజు ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్‌గా ఉన్నాడు. అతడికి మేము అవకాశాలు ఇచ్చాం. ఈ రోజు అతను ఎక్కడ ఉన్నాడో చూడండి. ఇది మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ రోజు 2011 భారత జట్టు గురించి మాట్లాడటం గర్వంగా ఉంది’ అని శ్రీకాంత్‌ అన్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/