కరోనాకు మందు కనిపెట్టాము

డిస్ట్రిబ్యూటెడ్‌ బయో చీఫ్‌ వెల్లడి.. ఆరు నెలల్లో అందుబాటులోకి..!

jacob glanville
jacob glanville

కాలిఫోర్నియా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారినుంచి ప్రజలను కాపాడే ఔషదాన్ని తయారు చేశామని, డిస్ట్రిబ్యూటెడ్‌ బయో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గ్లాన్‌ విల్లే ప్రకటించారు. కాగా ఇది అందుబాటులోకి రావడానికి ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు. కరోనా మానవ శరీరంలోని ఎస్‌ – ప్రోటీన్‌ కణాల ద్వారా ప్రవేశిస్తుందని , తాము ప్రయోగించిన యాంటీబాడీస్‌ , ఈ ఎస్‌ – ప్రోటీస్‌ ను నిర్వీర్యం చేస్తున్నాయని , దీనివల్ల కరోనా వైరస్‌ కూడా నాశనం అవుతోంని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇది క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్న వ్యాక్సిన్‌, అయితే ఇది అందుబాటులోకి రావడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టవచ్చు. దీని యొక్క ఫలితాలను మరో రెండు ల్యాబ్స్‌ సాయంతో నిర్ధారించుకుంటున్నామని జాకబ్‌ అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/