కోర్టు కేసులను సింహంలా ఎదుర్కొంటాం : కొల్లు రవీంద్ర

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. కోర్టులకు రాను, రాలేను అంటూ చేతకాని కబుర్లను తాము చెప్పమని… కోర్టు కేసులను సింహంలా ఎదుర్కొంటామని అన్నారు. గతంలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టుకు ఈరోజు నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ, బొండా ఉమ, కొల్లు రవీంద్ర తదితర నేతలతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే కొల్లు రవీంద్ర పైవ్యాఖ్యలు చేశారు. కేసులను సింహంలా ఎదుర్కొంటామని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/