ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాం
చంద్రబాబుకు స్వేచ్ఛను కల్పించాల్సిన ప్రభుత్వమే అడ్డుపడుతోంది

విజయనగరం: ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడిని ఎయిర్ పోర్టులో అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి స్వేచ్ఛను కల్పించాల్సిన ప్రభుత్వమే అడ్డుపడుతోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడిని ప్రజల దగ్గరకు వెళ్లకుండా చేయటం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులే అడ్డుకోమని చెప్పటం ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ అని పేర్కొన్నారు. అక్రమాలు ఎక్కడ జరిగిన అక్కడికి వెళ్లి చూసే బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులే చెప్పులు, కోడిగుడ్లు సరఫరా చేయటం మంచి పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/