డ్రగ్స్‌ కేసులో ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు

drugs case
drugs case


హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఏ ఒక్క టాలీవుడ్‌ సినీ నటులకు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని తెలిపారు. మొత్తం 12 కేసుల్లో ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు అయ్యాయని వెల్లడించారు. ఇంకా ఐదు ఛార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉందన్నారు. సమాచారహక్కు చట్టం కింద ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ వివరాలు కోరారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్‌ శాఖ సంబంధిత సమాచారాన్ని అందించింది. కేసు దర్యాప్తులో భాగంగా 12 మంది టాలీవుడ్‌ నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్‌తో పాటు మరో 62 మందిని విచారించినట్లు వెల్లడించినట్లు పేర్కొంది. సినీ ప్రముఖుల వ్యవహారంలో ఫోరెన్సిక్‌ ఆధారాలు వచ్చినట్లు తాజాగా తెలిపింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలేది లేదని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/